కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్

TG: కరీంనగర్ జిల్లాలో సహకార సంఘాల చైర్మన్లు BRSకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వాళ్లంతా BRSను వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు వ్యూహరచన చేసుకున్న సోసైటి చైర్మెన్లు.. అపాయింట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్లారట. వారంతా ఏ క్షణమైనా పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.