సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు విజయం
MDK: చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామ సర్పంచ్‌గా శంకర్ సబిత గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి శ్వేతపై 6 ఓట్ల తేడాతో అమె విజయం సాధించారు. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి సబిత విజయం సాధించారు. మండల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తొలి ఫలితం సాధించడంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.