VIDEO: వరంగల్ జిల్లాలో దట్టమైన పొగమంచు

VIDEO: వరంగల్ జిల్లాలో దట్టమైన పొగమంచు

వరంగల్ జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శుక్రవారం వరంగల్ నగరం మొత్తం తెల్లని దుప్పటి లాగా పొగమంచుతో కనిపించింది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులపై విజిబిలిటీ గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా వరంగల్–ములుగు ప్రధాన రహదారి, హన్మకొండ–వరంగల్ హంటర్ రోడ్డులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు నెమ్మదిగా సాగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.