నేడే ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమం: కలెక్టర్
KMM: మధిర పట్టణంలో నేడు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా మధిర రోడ్లోని వర్తక సంఘ భవనంలో ప్రజాపాలన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.