భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వినతి
BDK: ఇల్లందు ఏరియా వోసీ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని ఇవాళ విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ సర్పంచులు, అఖిలపక్ష నాయకులు ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ముందస్తు సమాచారం లేకుండా విజయలక్ష్మి నగర్ నిర్వాసిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సింగరేణి అధికారులు ఒత్తిడి చేయడం సరికాదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.