ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు
పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆరు నెలల తర్వాత వాంగ్‌చుక్ జైలు నుంచి విడుదల కానున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గతేడాది సెప్టెంబరులో లేహ్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లకు కారకుడిగా భావిస్తూ కేంద్రం ఆయనపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టింది.