ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతున్న దేవస్థానం
అన్నమయ్య: పవిత్రమైన కార్తీక మాస శుభ సందర్భంగా, చిట్వేలు మండలం నక్కలపల్లిలోని శ్రీ భవాని శంకర స్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతోంది. ఈ మాసంలో స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలలో భాగంగా, ఆలయంలో ప్రతిరోజూ ప్రదోష కాలము నందు విశేష సేవలు జరుగుతున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొంది. కార్తీక మాసం చివరి వరకు వివిధ పూజా కార్యక్రమాలు ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు.