ఎండిపోతున్న బోర్లు.. రైతులు విలవిల..!

ఎండిపోతున్న బోర్లు.. రైతులు విలవిల..!

NRML: కుభీర్ మండలంలో సాగు చేసిన పంటలకు భూగర్భ జలాల కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. సుమారు 8,000 ఎకరాల్లో మొక్కజొన్న, 2,000 ఎకరాల్లో శెనగ, 3,000 ఎకరాల్లో జొన్న పంటలు సాగుచేశారు. శెనగ, జొన్నకు ఇబ్బందులు లేకపోయినా మొక్కజొన్నకు నీటి సమస్య తీవ్రంగా మారింది. మండలంలోని పలు గ్రామాల్లో బోరుబావులు ఎండిపోవడంతో 100 ఎకరాల్లో పంట ఎండిపోయినట్టు రైతులు తెలిపారు.