VIDEO: కాంగ్రెస్ పార్టీలో మరోసారి భగ్గుమన్న వర్గపోరు..!
MHBD: తొర్రూరు పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ రెబల్ వర్గం నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 50 మందిని పిలిచిన తర్వాత తమను స్టేజీ మీదికి పిలుస్తారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముందే మండల పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.