ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం

ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం

ATP: అనంతపురంలో ట్రాఫిక్ మెరుగుదలకు అంకితభావం, సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ట్రాఫిక్, నగర పోలీసులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి దిశానిర్ధేశం చేశారు. ప్రధాన కూడళ్లలో ప్రజలు, వాహనదారులు అసౌకర్యానికి గురికాకుండా యాక్టివ్‌గా పని చేయాలని సిబ్బందికి సూచించారు.