పొలంలో కుప్పకూలి బిహార్ కార్మికుడు మరణం
HNK: ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురంలో శనివారం ఒక బిహార్‌కు చెందిన కార్మికుడు పొలంలో నాటు వేస్తూ ఉన్నప్పుడు కుప్పకూలి మృతి చెందాడు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఆయన ప్రాణాలు విడిచినట్లు గ్రామస్థులు తెలిపారు. వెంటనే స్థానికులు చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.