'ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి'
VZM: జిల్లాలో రీసర్వే, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి సిసిఎల్ఏ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో జరిగిన వీసీ అనంతరం మాట్లాడారు. రీసర్వే గ్రామాల్లో సర్వేయర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, డిప్యూటేషన్లు రద్దు చేయాలని సూచించారు.