అవని కరదీపికను ఆవిష్కరించిన కలెక్టర్ శ్రీధర్
KDP: 'ఒక కుటుంబం -ఒక వ్యాపారవేత్త' అనే నినాదంతో మెప్మా సంస్థ రూపొందించిన 'అవని' కరదీపికను కలెక్టర్ శ్రీధర్ గురువారం ఆవిష్కరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కరదీపికను ప్రత్యేకంగా తయారుచేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ సూచించారు.