నందిగామ జాతీయ రహదారిపై లారీ బోల్తా

నందిగామ జాతీయ రహదారిపై లారీ బోల్తా

శ్రీకాకుళం: నందిగాం మండలం పెద్దలవునిపల్లి సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రైన్‌లో పడి పోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అజేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.