నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేనకు అపూర్వ ఆదరణ

VZM: నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేనకు రోజు రోజుకి అపూర్వ ఆదరణ లభిస్తోందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెల్లడించారు. మండలంలోని బొప్పడాం పంచాయతీ పరిధి బుచ్చన్నపేటలో 30 కుటుంబాలు వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నాయి. భోగాపురం మండలం ముంజేరు జనసేన పార్టీ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే నాగమాధవి సోమవారం జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.