గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్‌ను సందర్శించిన సీఎం
HYD: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వార్ రూమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులను అడిగి ఏర్పాట్ల వివరాలను సీఎం ఆరా తీశారు.