VIDEO: పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు

VIDEO: పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు

KDP: వల్లూరు మండలం పుష్పగిరిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో హరిహరుల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం విశేష తిరుమంజన సేవ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సేవ ప్రతిరోజూ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్వామి వారికి నిర్వహిస్తారు. రాత్రి సమయంలో వైద్యనాధేశ్వర స్వామి హంస వాహనంపై, చెన్నకేశవ స్వామి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.