జిల్లాలో మొదటి విడుతలో ఓటేసే వారు ఎంత అంటే..?
NZB: జిల్లాలో మొదటి విడుతలో 11 మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2,62,210 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలు 1,37,413 మంది, పురుషులు 1,23,790 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఇందుకోసం 1,653 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వివరించారు.