జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: CP
WGL: జిల్లా కోర్టులో ఈ నెల 15న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని WGL CP సన్ ప్రీత్ సింగ్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, ఆస్తి తగాదాలు, కుటుంబ, వైవాహిక సహా రాజీపడదగిన కేసులకు పరిష్కారం లభిస్తుందని CP తెలిపారు. రాజీ మార్గమే రాజా మార్గమని ఆయన పేర్కొన్నారు.