VIDEO: గుండెల్ని పిండేసే ఘటన
MBNR: జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ్‌నగర్ పత్తి మిల్లులో పనిచేస్తూ బాలరాజ్ అనే వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు. మిల్లు మూతపడి ఉపాధి కోల్పోవడంతో చిన్న కుమారుడితో భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో అనారోగ్యంతో దివ్యాంగుడైన పెద్ద కుమారుడు హరీష్(8) మృతి చెందాడు. కొడుకు అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక బాలరాజ్ స్మశానంలోనే 8 గంటల పాటు మృతదేహంతో ఉండిపోయాడు.