లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: ఆర్డీవో
ATP: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని అనంతపురం RDO కేశవ నాయుడు హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన PCPNDT కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో లింగ వివక్షను తొలగించేందుకు కిశోర యువతులకు, కళాశాల విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.