పుంగనూరు ముడిపాపనపల్లి PHC తనిఖీ

CTR: పుంగనూరు మండలం ముడిపాపన పల్లి PHCని శుక్రవారం జిల్లా మలేరియా అధికారి డా. వేణుగోపాల్ తనిఖీ చేశారు. ల్యాబ్, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం అడవినాథుని కుంట గ్రామానికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత, దోమల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి గంగయ్య, సిబ్బంది పాల్గొన్నారు.