వేంపల్లెలో నాలుగో తరగతి విద్యార్థి మృతి

KDP: వేంపల్లెలో గ్రామంలో విషాదం నెలకొంది. వివరాల్లోకెళ్తే శ్రీరామ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రఘువరన్ నాలుగో తరగతి చదువుతున్నాడు. జ్వరంతో రావడంతో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, విష జ్వరం కావడంతో పరిస్థితి విషమించింది. ఈ మేరకు తిరుపతికి తీసుకెళ్లగా అక్కడ బెడ్లు దొరకకపోవడంతో తిరిగి కడప రిమ్స్ తీసుకు వచ్చారు. కాగా, చికిత్స పొందుతూ రఘువరన్ చనిపోయాడని అతని తండ్రి ఓబులేసు తెలిపారు.