ఇంటి అద్దె కట్టలేక.. హోటల్‌కు మారి లక్షల ఆదా

ఇంటి అద్దె కట్టలేక.. హోటల్‌కు మారి లక్షల ఆదా

ఓ అమెరికన్ జంట వినూత్న ఆలోచనతో డబ్బు ఆదా చేస్తున్నారు. ఇంటికి నెలకు $2,300ల అద్దె భారం కావడంతో హోటల్‌కు నివాసం మార్చారు. అక్కడ విద్యుత్, ఇంటర్నెట్ వంటి వసతులతో కలిపి నెలకు కేవలం $1,200 (రూ.1.13 లక్షలు) మాత్రమే ఖర్చవుతోంది. దీంతో ఏడాదికి సుమారు రూ.11 లక్షలు ఆదా అవుతోంది. ఆ డబ్బుతో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేయాలని ఆ జంట నిర్ణయించుకుంది.