చేనేత ఉత్పత్తులను ఆదరించాలి: నాబార్డ్ డీడీఎం

చేనేత ఉత్పత్తులను ఆదరించాలి: నాబార్డ్ డీడీఎం

WNP: అమరచింత మున్సిపాలిటీలో నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల రూరల్ మార్ట్‌ను ఇవాళ నాబార్డ్ డీడీఎం మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా చేనేత కార్మికుల జీవితాలను కాపాడుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో కంపెనీ LDM, RDS డైరెక్టర్ వెంకటస్వామి, కంపెనీ సీఈవో శేఖర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.