కలెక్టర్‌కైనా చెప్పుకోండి.. త్రాగునీరివ్వం

GNTR: ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామంలో ప్రభుత్వం పేదవారికి ఇచ్చిన లేఔట్‌లోని ప్రజలకు త్రాగునీటిని అందించటంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. 5రోజులుగా లేఔట్‌కు చుక్క నీరు కూడా అందించగా పోగా.. ఇదేమని ప్రశ్నించిన కాలని వాసులకు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధామిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కి చెప్పినా నీరు ఇవ్వమని చెప్పడం గమనార్హం.