వైసీపీ నాయకుడి మృతి

అన్నమయ్య: పెనగలూరు మండలం పేరంవాండ్లపల్లికి చెందిన వైసీపీ నాయకులు పేరం చిన్న రెడ్డయ్య గుండెపోటుతో మృతిచెందారు. సమాచారం అందుకున్న రైల్వే కోడూరు మాజీ MLA కొరముట్ల శ్రీనివాసులు పేరంవాండ్లపల్లికి వెళ్లారు. చిన్న రెడ్డయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీరితో పాటు సర్పంచ్ శివయ్య నాయుడు,తదితరులు పాల్గొన్నారు.