స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కమిషనర్

స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కమిషనర్

ప్రకాశం: స్వర్ణ ఆంధ్ర-స్వేచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కనిగిరి మున్సిపల్ పరిధిలో వర్షాకాలం నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఒంగోలు బస్టాండ్, సుదర్శన్ థియేటర్ వద్ద తదితర ప్రాంతాలలో ఉన్న చిల్ల చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.