ఉడాన్ పథకానికి రూ.28,840 కోట్లు కేటాయింపు
పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల కేంద్రం సవరించిన ఉడాన్ పథకానికి రూ.28,840 కోట్ల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసింది. చిన్న నగరాలకు విమాన సేవలను విస్తరించడమే లక్ష్యంగా ఉడాన్ 2.0ను కేంద్రం తీసుకువచ్చింది. అలాగే ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్, ట్రాకింగ్ స్కీమ్‌ను మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.