మల్లన్నను దర్శించుకున్న సీబీఐ మాజీ జేడీ వీవీ
NDL: శ్రీశైలం మల్లన్నను సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనలు అందించి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. ఆయన వెంట పలువురు పూర్వ విద్యార్థుల సంఘం నేతలు పాల్గొన్నారు.