VIDEO: సౌదీ బస్సు ప్రమాదంలో 16 మంది మల్లేపల్లి వాసులు మృతి
HYD: సౌదీలో డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టడంతో 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో HYD మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సీఎం సూచించారు.