VIDEO: పిచ్చికుక్క దాడి.. ఏడుగురికి గాయాలు

VIDEO: పిచ్చికుక్క దాడి.. ఏడుగురికి గాయాలు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ఫిరంగిగడ్డ ప్రాంతంలో మంగళవారం పిచ్చికుక్క సైర్వవిహారం చేసింది. కుక్క దాడిలో ఏడుగురు గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు సఫాయి కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో భయాందోళనకు గురైన పట్టణవాసులు చివరకు ఆ కుక్కను చంపివేశారు. వీధి కుక్కల బారి నుంచి అధికారులు తమను రక్షించాలని స్థానికులు వేడుకున్నారు.