VIDEO: కన్నుల విందుగా ఉమామహేశ్వర స్వామి కళ్యాణం

VIDEO: కన్నుల విందుగా ఉమామహేశ్వర స్వామి కళ్యాణం

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ఉన్న గౌరీ దేవి అమ్మవారి ఆలయం వద్ద శనివారం రాత్రి శ్రీ అన్నపూర్ణ సమేత ఉమామహేశ్వర స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు.