నదిలో ఫొటో దిగుతూ.. యువకుడు గల్లంతు
MNCL: బాదంపల్లి గోదావరి రేవులో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. జన్నారం మండలం పోనకల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండా శ్రావణ్ కుమార్ (33) అనే యువకుడు శనివారం బాదంపల్లి గోదావరి రేవులో స్నానానికి దిగాడు. సదరు వ్యక్తి ఫొటో తీస్తుండగానే నదిలో నీటిప్రవాహం ఎక్కువై శ్రావణ్‌కుమార్ గల్లంతయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.