ఎర్రకోట వద్ద పేలుడు.. ఉగ్ర కోణంపై అనుమానాలు
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో జరిగిన పేలుడు ఘటనకు ఉగ్ర సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భద్రతా బలగాలు జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్‌వత్-ఉల్-హింద్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి దాదాపు 2,900 కిలోల IED స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ, ఢిల్లీలో ఈ పేలుడు ఘటన సంభవించడం కలకలం సృష్టిస్తోంది.