ఎస్పీని సత్కరించిన కొండగట్టు ఆలయ ఈవో

ఎస్పీని సత్కరించిన కొండగట్టు ఆలయ ఈవో

JGL: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా, శాంతియుతంగా పూర్తయినందున, జిల్లాస్థాయి అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేసినందున ఆలయ ఈవో శ్రీకాంత్ రావు శనివారం ఎస్పీ అశోక్ కుమార్‌ను శాలువాతో సత్కరించి, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు సునీల్ పాల్గొన్నారు.