కాటారం గిరిజన బాలుర పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం

BHPL: కాటారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో గురువారం డాక్టర్ ఎం. మౌనిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది పిల్లలకు సమగ్ర వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.