కేంద్రం కీలక నిర్ణయం.. తప్పుడు ప్రచారాలకు చెక్

కేంద్రం కీలక నిర్ణయం.. తప్పుడు ప్రచారాలకు చెక్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఎల్పీజీ, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, లభ్యతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై వస్తున్న తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకు ఇకపై ప్రతిరోజూ 'డైలీ బ్రీఫింగ్' నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు(CS) కేంద్ర పెట్రోలియం శాఖ లేఖ రాసింది.