VIDEO: ఖాళీ బిందెలతో మహిళల నిరసన

VIDEO: ఖాళీ బిందెలతో మహిళల నిరసన

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ మహబూబ్ నగర్ గ్రామంలో మంచినీటి కోసం బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా మంచినీరు రావడంలేదని నీటి కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. సంబంధిత అధికారులు తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.