వర్షాలకు కూలిన రెండు మట్టి మిద్దెలు

వర్షాలకు కూలిన రెండు మట్టి మిద్దెలు

NDL: బేతంచెర్ల పట్టణంలోని దుర్గాపేట కాలనీలో బుధవారం అధిక వర్షాల కారణంగా రెండు మట్టి మిద్దెలు కూలిపోయాయి. బుధవారం నాడు అకస్మాత్తుగా రెండు మట్టి మిద్దెలు కూలిపోవడంతో బాధితులు అయ్యమ్మ రామాంజనేయులు లబోదిబోమని వాపోయారు. తమకు రెండు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.