విధులలో చేరిన పాలన అధికారులు

MNCL: జన్నారం మండలంలో గ్రామ పాలన అధికారులు విధులలో చేరారని స్థానిక తాహసిల్దార్ రాజా మనోహర్ రెడ్డి తెలిపారు. గ్రామాలలో రెవెన్యూ అధికారులకు సహకరించేందుకు ప్రభుత్వం 16 మంది గ్రామ పాలన అధికారులను కేటాయించింది. వారికి కేటాయించిన గ్రామాలలో వారు విధులలో చేరారని ఆయన తెలిపారు. పాత క్లస్టర్ ప్రకారం ప్రభుత్వం వారిని కేటాయించడం జరిగిందని తాహసిల్దార్ వివరించారు.