యాదాద్రి స్వామి వారికి వైభవంగా మొక్కు జోడు సేవ

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి వెండి మొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం స్వామి వారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చిపై వేంచేపు చేశారు. అనంతరం మాఢ వీధుల్లో మంగళ వాయిద్యాలతో నేత్రపర్వంగా ఊరేగించి, మంగళ నీరాజనాలు సమర్పించారు. జోడు సేవలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు