పర్యావరణ హితంగా హోళీ జరుపుకోండి:ఎస్పీ

పర్యావరణ హితంగా హోళీ జరుపుకోండి:ఎస్పీ

MHBD: హోళీ పండుగను ప్రకృతి సిద్ధమైన రంగులతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శబరిష్ ప్రజలకు సూచించారు. రసాయన రంగుల వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, పర్యావరణ హిత రంగులనే వాడాలని కోరారు. ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు చేసుకోవాలన్నారు. బలవంతపు చందాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.