'స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి'
KMM: కారేపల్లిలో జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటాలని పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు కలిసికట్టుగా పనిచేసి, అన్ని స్థానాల్లో గెలుపొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.