'నేటితో ఇంటర్ పరీక్ష ఫీజుకు గడువు పూర్తి'
KKD: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువు శుక్రవారంతో ముగియనుందని కాకినాడ జిల్లా ఇంటర్ విద్య అధికారిణి (డీఐఈవో) ఐ. శారద తెలిపారు. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో నవంబర్ 6 వరకు అవకాశం కల్పించారన్నారు.