ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్సై

ప్రకాశం: హనుమంతులపాడు మండలం వేములపాడు రోడ్డులో ఆటో డ్రైవర్లకు శుక్రవారం ఎస్ఐ మాధవరావు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా డ్రైవర్లు లైసెన్స్ విధిగా కలిగి ఉండాలని, ఆటోల్లో ఎక్స్‌ట్రా సీటింగ్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.