నిండిన ఒంటిమిట్ట గంగల చెరువు
KDP: దాదాపు 4 ఏళ్ల తర్వాత ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లె సమీపంలోని గంగల చెరువు నిండి అలుగు పొల్లడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఎండాకాలంలో ఎండిపోయిన చెరువు ఇప్పుడు పొంగి పొల్లడంతో గ్రామస్తులు ఆనందోత్సవాలతో మునిగిపోయారు. చెరువు నిండడంతో ప్రజలు గంగమ్మకు కాయ, కర్పూరం, సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.