VIDEO: రాజంపేటలో చిన్నారుల బెగ్గింగ్..!
అన్నమయ్య: రాజంపేటలో చిన్న పిల్లలు బెగ్గింగ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఎవరు ఇలా చేయమంటున్నారని అడిగితే పిల్లలు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఇటీవల మున్సిపాలిటీ, ICDS తదితర శాఖల అధికారులు సమావేశమై ఈ సమస్యపై చర్చించారు. అయినప్పటికీ చిన్నారుల బెగ్గింగ్ ఆగడం లేదు. బాలల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.