తాండూర్ విద్యార్థికి రాష్ట్రస్థాయి అవార్డు

తాండూర్ విద్యార్థికి రాష్ట్రస్థాయి అవార్డు

VKB: తాండూరు పట్టణంలోని ఓ హై స్కూల్‌కు చెందిన 6వ తరగతి విద్యార్థి జీ.కార్తీకేయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. ఆదివారం హైదరాబాద్‌లోని గుజరాతీ మహా విద్యాలయంలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పోటీలో కార్తీకేయ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. విద్యార్థి ప్రతిభను పాఠశాల యాజమాన్యం అభినందించింది.