బీఆర్‌ఎస్ సర్పంచ్‌గా అడేపు స్రవంతి ఘన విజయం
HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి అడేపు స్రవంతి 142 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామంలో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గతంలో ఆమె భర్త అడేపు దయాకర్ సర్పంచ్‌గా సేవలందించగా, ఆ అనుభవం మరియు కుటుంబానికి ఉన్న స్థానిక మద్దతు ఈ విజయంలో కీలక పోషించింది.